
శ్రీ షిర్డీ సాయిబాబా అసలు పేరు ఎవరికీ తెలియదు. సాయిబాబాను ముస్లింలు, హిందువులూ సాధువుగా నమ్ముతారు. ఈయన జీవిత నడవడిలో, భోధనలలో రెండు మతాలను అవలంభించి, సహయోగము కుదర్చడానికి ప్రయత్నించాడు. సాయిబాబా మసీదులో నివసించాడు, గుడిలో సమాధి అయ్యాడు. రెండు మతాల పద్ధతులను తన బోధనలో అవలంభించాడు. ఈయన రెండు సాంప్రదాయాల యొక్క పదాలను, చిత్రాలను ఉపయోగించాడు. ఈయన యొక్క వ్యాఖ్యలలో ముఖ్యమైన ఒక వాక్యము అల్లా మాలిక్, సబ్ కా మాలిక్ ఎక్ (सबका मालिक एक) (అందరి ప్రభువు ఒక్కడే).
శ్రీ సాయిబాబా శిరిడీలొ 60 సంవత్సరములు నివసించినప్పటికి ఆయన కీర్తి మధ్యాన్న సూర్యుని శొభవలె అన్నిదిక్కులా ఆ కాంలోనే వ్యాపించినప్పటికి, సాయిబాబా అసలు పేరేమిటొ, ఊరేమిటొ, తల్లితండ్రులెవరో, కులగొత్రాలేమిటొ ఎవరికీ తెలియలెదు. ఆయన దర్శనానికి నిత్యము ఎందరెందరో అన్ని ప్రాంతాలనుండి వస్తూ ఉండేవారు కాని వారిలొ ఏ వక్కరూ అయన గురించి ఏమి చెప్పలేకపొయారు. ఆయనతొ సన్నిహితంగా చాలాకాలం ఉన్నవారు కూడ ఆయన నుండి ఈ వివరములు తెలుసుకొఆలేకపొయారు. దైవం వలెనే ఆయన నామ రహితుడు.
శ్రీ సాయి 1854 ప్రాంతంలొ ఒకరోజు ఆ గ్రామానికి ఉత్తరాన ఉన్న ఒక వేపచెట్టు క్రింద కూర్చొని కనిపించారు. నాడు ఆయనను చూసిన వృద్దురాలు " ఈ బాలుడు మొదట వేపచెట్టు క్రింద ఆసనం వేసుకొని కూర్చొని కనిపించాడు. అతడి రూపము మనొహరముగా ఉండేది.ఎప్పుడు ఎవరింటికి వెళ్ళకుండా ఆ చెట్టు నీడనే ఉండేవాడు. పగలెవ్వరితోనూ కలిసేవాడు కాదు. రాత్రి సమయాలలో కూడా ఆతను భయమెరుగడు. ఛూడడానికి చిన్నవాడే అయినా అతడి చర్యలు అతడు మహా జ్ఞానియని సూచించేవి. అంత చిన్న వయస్సులో చలికి, వేడికి చలించక తపస్సు చేసే అతడిని చూసి అందరూ ఆశ్చర్యపోయేవారు.
ఈ వింత బాలుడు కొంత కాలానికి అకస్మాత్తుగా ఎక్కడికో వెళ్ళిపోయి, సుమారొక సంవత్సరం తరువాత శిరిడీ చేరుకొని అక్కడే ఉండిపొయారు. ఈ మద్య కాలంలో ఆయన ఎక్కడకు వెళ్ళారో, ఏమి చెసారో ఎవరికీ తెలియదు.
శ్రీ సాయిబాబా 1918 అక్టొబరు 15 న మహా సమాధి నొందిరి.
సాయిబాబా ఏకాదశ సూత్రములు
1. షిర్డి ప్రవేశమే సర్వ దుఖః పరిహరము.
2. అర్హులైననేమి నిరుపేదలైననేమి ద్వారకమాయి ప్రవేశమొనరించినంతనె సుఖసంపదలు పొందగలరు.
3. ఈ భౌతిక దేహనంతరము నేనప్రమత్తుడనె.
4. నా భక్తులకు రక్షణంబు నా సమాధి నుండియె వెలువడుచుండును.
5. నా సమాధి నుండియె నా మనుష్య శరీరము మాట్లాడును.
6. నన్నాశ్రయించిన వారిని, శరణుజొచ్చిన వారిని రక్షించుటయే నా కర్తవ్యము.
7. నా యందెవరికి దృష్టియో వారియందే నా కటాక్షము.
8. మీ భారములు నాపై బడవెయుడు, నేను మోసెదను..
9. నా సహాయము గాని, సలహాను గాని కొరిన తక్షణ మొసంగ సంసిద్దుడను.
10. నా భక్తుల గృహములందు 'లేమి' యను శబ్దమే పొడసూపదు.
11. నా సమాధి నుండియే నేను సర్వకార్యములు నిర్వహింతును.
This comment has been removed by a blog administrator.
ReplyDeleteదన్యవాదములు
ReplyDeleteSab ka mallic Ek
ReplyDelete